ziddu
Tuesday, 6 November 2007
పవన్ కళ్యాణ్ నటించి, దర్శకత్వం వహిస్తున్న 'సత్యాగ్రాహి' సినిమా సినిమా షూటింగ్ శనివారం (మార్చి 25) మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభమైంది. దాసరి నారాయణ రావు క్లాప్ కొట్టగా, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వెంకటేష్, వివి వినాయక్, అల్లు అర్జున్, నితిన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'సత్యాగ్రహి' సినిమా సూపర్‌హిట్ కాగలదని పవన్ ఆప్తమిత్రుడు వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ దర్శకుడిగా తన సత్తా నిరుపించుకోబోతున్నాడని దాసరి నారాయణరావు విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యయి. ఈ సినిమాకు అందుకు పూర్తి భిన్నంగా పెద్ద హంగామాతో ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ సినిమా సమాజంలో రాజకీయ చైతన్యానికి సంబంధించినది కాబట్టి పెద్ద పబ్లిసిటీతో ప్రారభించవలసి వచ్చిందని చెప్పారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, బెంగాలీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్టు నిర్మాత ఎంఎం రత్నం తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment